Tuesday, December 18, 2012

మానవ సేవే పరమావధి

మనం ఏ మతస్థులమైనా ఎన్నో గుళ్లకు, ప్రార్థనా మందిరాలకు, తీర్థయాత్రలకు వెళుతున్నాం. చేసిన, చేస్తున్న పాపాలను కడిగేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మళ్లీ పాపాలు తెలిసే చేస్తున్నాం. ఇది సరైందేనా ఓ సారి ఆలోచిద్దాం.


భగవంతుడు మనకు ఏమీ ఇవ్వలేదనుకుంటే పొరబాటే. ఎంతో మందితో పోల్చితే మనకెన్నో ఇచ్చాడు. మనం దానిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోక, ఇంకా ఏదో కావాలన్న కోర్కెలతో తప్పులు చేస్తూనే, క్షమించాలని ఆయనను శరణు వేడుతున్నాం.


నేను సర్వాంత ర్యామిని అని చెప్పే దేవుడిని చూసేందుకు ఎక్కడకో ఎందుకు వెళ్లాలి. నీ ఇంటిలోనే, నీ మనసులోనే ఉన్న దేవుడిని కొలుచుకోవచ్చుగా. అక్కడికి వెళ్లేందుకయ్యే ఖర్చుతో నీ పక్కన ఉన్న సహాయార్థిని ఆదుకోవచ్చుగా.


మనం సాయం చేసే సమయంలో అతనికి ఆ అర్హత ఉందా అని ఆలోచించాల్సిందే. అలా లేకుంటే మనం అందర్నీ బలహీనులం చేసిన వాళ్లు కాగలం. అయితే నిజంగా సహాయం అవసరమై ఉన్నారని తెలిస్తే మాత్రం వారి గుణగణాల్ని, గతాన్ని పక్కనబెట్టి ఆదుకోవడం మనధర్మం. మనకు సాధ్యమైనంత మేర వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తాం.