Tuesday, February 2, 2016

అందానికి అందం....ఆదాయానికి ఆదాయం

గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి చేయూతను అందిద్దాం
ఆర్థిక ఇబ్బందులే పలు కుటుంబాల్లో గొడవలకు, సమస్యలకు  ప్రధాన కారణాలుగా ఉన్నాయని నా పరిశీలనలో తెలియడంతో వారికి శాశ్వత ప్రాతిపదికన ఎలా చేయూతను అందించగలమనే విషయంపై చాలా రోజులుగా నాలో నేను మదనపడుతూవచ్చాను. మధ్య తరగతి కుటుంబీకుడైన నేను నా దగ్గరకు వచ్చిన వారందరికీ ఆర్థికంగా చేయూతనందించలేకున్నా వారిలో ఆత్మవిశ్వాసం నింపే నిర్మాణాత్మకమైన జీవనోపాధి మార్గాన్ని చూపించాలని తపిస్తున్నాను. ఒక ఐడియా వారి జీవితాలను బాగు పరచగలదనే నమ్మకంతో ముందుకెళుతున్నా. సహజంగానే నేను చెన్నైలాంటి ఓ మహానగరంలో పాత్రికేయుడిని కాబట్టి చాలా మంది మంచి వ్యక్తులను కలిసే భాగ్యం నాకు కల్పించింది. ఏది బడితే దానిని వార్తగా రాయడం కన్నా నలుగురికి ఉపయోగపడే విషయాలను, కథనాలను రాయడం నాకు చాలా ఇష్టం కాబట్టి అలాంటి అంశాలకోసమే నా వెదుకులాట సాగింది. 

ఇదే క్రమంలో చెన్నైలో నామమాత్రపు ఫీజుతో మహిళలకు సుమారు యాభై రకాల స్వయం ఉపాధి మార్గాలపై శిక్షణ ఇస్తున్న ఉమారాజ్ అనే  మహిళ పరిచయమయ్యారు. ఆమె ఇస్తున్న శిక్షణ నాకు సంతృప్తికరంగా అనిపించినందున ఆవిడ గురించి ఈనాడు పత్రికలో కొన్ని నెలల కిందట ఓ కథనం రాశాను. ఇక్కడే కథ మొదలైంది. ఆవిడ శిక్షణ ఇస్తున్న అంశాల్లో రాజస్థానీ హెర్బల్ బ్యూటీ పౌడర్ తయారీ నాకు బాగా నచ్చింది. ఇది మహిళలకు అన్ని రకాలుగా మంచి ప్రయోజనం కలిగించే విషయంగా నాకు అనిపించింది. ఆ రోజుల్లో రాజస్థానీ మహ రాణులకు సౌందర్య సాధనంగా ఉపయోగపడిన ఈ వనమూలికల బ్యూటీ పౌడర్ తయారీ గురించి ఆవిడ దగ్గరకు వెళ్లి తెలుసుకున్నాను. అప్పట్లో రాజస్థానీ మహిళలు తమిళనాడులో మాత్రమే లభిస్తూవచ్చిన కొన్ని రకాల వన మూలికలతో తయారు చేసిన ఈ సౌందర్య సాధనాన్ని ఉపయోగించడం వల్లే వయసు మీద బడిన తర్వాత కూడా వారి చర్మం బాగా నిగనిగలాడేదని  ఆమె తెలిపారు.
నలుగురికి మంచి చేయాలనే నా ఉద్దేశ్యం గురించి, మేము మా సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఆవిడ దానిని నాకు ఉచితంగానే నేర్పించడానికి ముందుకు వచ్చారు. కానీ, అది ఆమె జీవనోపాధి అయినందున నేను ఆమెకు ఫీజు చెల్లించి, దాని తయారీ విధానాన్ని నేర్చుకున్నాను. ఏదయినా మననుంచే మొదలు కావాలనే బోధనను గట్టిగా అనుసరించే నేను దానిని మొదటగా నాపైన, నా కుటుంబంపైనే ప్రయోగించుకున్నాను. అది మంచి ఫలితాలను ఇస్తుండడంతో మా దగ్గరకు వస్తున్న కొంతమంది మహిళలకు కూడా వాటిని ఇవ్వడం మొదలు పెట్టాము. వారు కూడా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక దానిని భారీ స్థాయిలో తయారు చేసి, పలువురికి ఉపాధి కల్పించడానికి సిద్ధమయ్యా. నేను వారానికి ఆరు రోజులు చెన్నైలో ఉంటున్నా, మా ఊరిలో ఉన్న మా శ్రీమతి సుప్రజ ద్వారా దీనిని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ రాజస్థానీ హెర్బల్ బ్యూటీ బాడీ వాష్ పౌడర్  తయారీ ద్వారా కొంత మంది, తమ ఇళ్లలోనే ఉంటూ ఇరుగు, పొరుగుకు విక్రయించడం ద్వారా మరికొంతమంది ఉపాధి పొందగలిగేలా ఎవరి పరిస్థితులకు తగ్గట్టు వారికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇలా చేయడం ద్వారా ఏదో రకంగా వారి కుటుంబానికి అదనపు రాబడి సమకూరుతుందని మా నమ్మకం. 

సరే మనమేం చేద్దాం అని ఆలోచిస్తున్నారా? సరిగ్గా అక్కడకే వస్తున్నా. మొత్తంపైన మూడు కేజీల ఈ హెర్బల్ బ్యూటీ బాడీవాష్ పౌడర్‌ను తయారు చేయడానికి పదిహేను వందల రూపాయలు ఖర్చవుతోంది. నాకు ఈ శిక్షణను అందించిన మహిళ చెప్పిన దాని ప్రకారం మార్కెట్లో దానిని మూడు వేల రూపాయలకు విక్రయించాలి. కాబట్టి, దానిని యాభై, వంద గ్రాముల చిన్న ప్యాకెట్ల రూపంలో రెండు వేల రూపాయల ధరతో విక్రేతలకు అందించాలని నిర్ణయించాం.  తద్వారా వాటిని తయారు చేస్తున్న వారికి ఐదు వందలు తయారీ కూలీగాను, విక్రయిస్తున్న వారికి వెయ్యి రూపాయలు లాభంగానూ అందుతాయి. ఇది అందరికీ ఉపయోగపడే వస్తువే కాబట్టి, మనం నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకుంటే మంచి వ్యాపార అవకాశంగా కూడా మలచుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో వారు వ్యాపార మార్గంగానూ, గ్రామీణ ప్రాంతాల వారు స్వయం ఉపాధి మార్గంగానూ దీనిని మలచుకోవచ్చు. అయితే తక్కువ పక్షం కేజీ ఆర్డర్ అయినా ఉంటేనే కొరియర్ ఛార్జీలను మేమే భరించి, మీకు పంపగలము. అంతకన్నా తక్కువ పరిమాణంలో కావాలంటే కొరియర్ ఛార్జీలను మీరు భరించాల్సి ఉంటుంది. అంటే, కేజీకి 700, రెండు కేజీలకు 1,400, మూడు కేజీలకు 2,000 రూపాయలను మా బ్యాంకు ఖాతాలో జమ చేస్తే, నాలుగైదు రోజుల్లో మీకు ఈ రాజస్థానీ హెర్బల్ బ్యూటీ బాడీ వాష్ పౌడర్ అందుతుంది. అర కేజీకి అయితే కొరియర్ ఛార్జీలను కలిపి 400 రూపాయలు, పావు కేజికి అయితే 225 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొదట మీరు వాడి, నచ్చితేనే వ్యాపారావకాశంగా మలచుకోవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను సాధికారత దిశగా నడిచించాలని ముందుకు వచ్చే వారికి నామమాత్రపు ఫీజుతో తపాలా ద్వారా నేర్పించడానికి కూడా సిద్ధమే కానీ ఇందులో ఉపయోగించే కొన్ని వనమూలికల పేర్లు తమిళంలో ఉన్నాయి. పెసర, శెనగపప్పు, కలబంద లాంటివి మనకు ఎక్కడైనా దొరుకుతాయి కానీ, తమిళ పేర్లతో కూడిన వనమూలికలను తెలుగులో ఎలా చెప్పాలో నాకే తెలియదు. అదీగాక వాటికోసం నాలుగుచోట్ల తిరగాల్సి ఉంటుంది. అవసరమైతే, మొదటిసారి ఆ వస్తువులను నేనే పంపుతాను. రెండో సారి మీరు దానిని చూపి, ఎక్కడైనా దొరుకుతాయోనని పరిశీలించి కొనగలరు. మీకు దొరకని వనమూలికలను నేను సరఫరా చేయగలను. శిక్షణకోసం నామమాత్రపు ఫీజును మీరు చెల్లించాల్సి ఉంటుంది. దానిని కూడా మరొకరికి సహాయం చేసేందుకే ఉపయోగిస్తామనే హామీని నేను ఇవ్వగలను. ఇక మీదే ఆలస్యం. మన పనులకు ఇబ్బంది కలగని రీతిలో సమాజానికి చేతనైన సాయం చేద్దాం. బ్రాండ్ ప్రచారాలతో ఊదరగొట్టే రసాయనాలు కలిసిన సబ్బు బిళ్లలను వాడటానికి బదులు ప్రకృతి ప్రసాదించిన ఈ వనమూలికల సౌందర్య సాధనాన్ని వాడడం ద్వారా మనం ప్రయోజనం పొందడంతో పాటు నలుగురు గ్రామీణ పేద మహిళల జీవితాల్లోనూ వెలుగునింపుదాం. మహిళలే కాదు. నలుగురికి మంచి చేయాలనే సంకల్పం ఉంటే పురుషులు కూడా ముందుకు రావచ్చు. తమ భార్యలనో, కుటుంబ సభ్యులనో, తమకు తెలిసిన మహిళలనో ఈ స్వయం ఉపాధి మహోద్యమంలో భాగస్వాములు చేయవచ్చు.  కాదంటారా మిత్రులారా. వివరాలకోసం నన్ను 09962991930, 08939088870 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

Sunday, January 31, 2016

పక్షవాతానికి ఉత్తమ చికిత్స


వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు


పదో తరగతి ప్రతిభావంతులకు ఇన్ఫోసిస్ సాయం


పదేళ్లలోపు పిల్లలకు ఉచిత గుండె చికిత్సలు



మడత కాళ్ల వ్యాధికి ఉచిత చికిత్స


చిన్నారులకు ఉచిత వైద్య సేవలు


గుండెపోటు ముందస్తు హెచ్చరికలు


బంగారం తయారీలో తరుగు వివరాలు


చిన్నారుల చదువుకోసం సూర్య సాయం


ఆధార్ కార్డు పొందడం ఎలా?


వికలాంగులకు ఉచిత అవయవాలు


కరెంట్ షాక్ తో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం




Monday, January 18, 2016

కేవ‌లం మూడువేల రూపాయ‌లకే కంప్యూట‌ర్ల‌ ఎక్స్‌ఛేంజ్


Exchange any old CPU / Laptop working or not working, and get a DELL CPU just @ Rs. 3000. Configuration: Dell MCoreP4, 1 GB DDR2 RAM, 80 GB Sata HDD, Windows 7 installed. Dell Factory refurbished systems. Hurry up. For more information, please call 9290583333. Limited Systems available.
ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసే కంప్యూటింగ్ అవ‌కాశాలు ఎంచుకోవ‌డం మీద ఈమ‌ధ్యనే జ‌నంలో బాగా అవ‌గాహ‌న పెరుగుతోంది. ఒక గంట క్రితం నేను షేర్ చేసిన ఒక పోస్టుకు 13 ఫోన్‌కాల్స్ అందుకోవ‌డ‌మే అందుకు సాక్ష్యం.
డెల్ రీఫ‌ర్బిషింగ్ ఫాక్ట‌రీ మంచి ఆఫ‌ర్ ఒక‌టి వచ్చింది ఈరోజు. మ‌న ఇళ్ల‌లో, ఆఫీసుల్లో ప‌డివున్న ప‌నిచేస్తున్న‌, ప‌నిచేయ‌ని కంప్యూట‌ర్ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేయ‌డం ద్వారా కేవ‌లం మూడువేల రూపాయ‌లకే ఎమ్‌కోర్‌పి4 రీఫ‌ర్బిష్డ్ సీపీయూ పొంద‌వ‌చ్చు.
ఈ పాత కంప్యూట‌ర్ల విడిభాగాల‌ను గ్రీన్ ఏజెన్సీలు ఫాక్ట‌రీ మోడ్‌లో డిటాచ్ చేసి, తిరిగి ప‌నికొచ్చేవిధంగా రీఫ‌ర్బిష్ చేస్తాయి. ఇవ్వాళ్టికీ పెంటియ‌మ్ ప్రాసెస‌ర్ల‌నే ఉపయోగిస్తున్న కొన్ని ఆఫ్రిక‌న్‌, ఇత‌ర దేశాల‌కు త‌యారుచేసే కంప్యూట‌ర్ల‌కు వీటిని ఉప‌యోగిస్తారు. ఫ‌లితంగా ఆయా దేశాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌ల‌కు కంప్యూట‌ర్లు చేర‌తాయి. ప‌ర్యావ‌ర‌ణం మీద దుష్ప్ర‌భావం కూడా త‌గ్గుతుంది.
మీ ద‌గ్గ‌ర పాత కంప్యూట‌ర్లుంటే ఈ-వేస్ట్ కింద మార్చండి, మీ ఇంట్లో రేడియేష‌న్ ప్ర‌భావాన్ని త‌గ్గించుకోండి, ప‌ర్యావ‌ర‌ణానికి సాయప‌డండి. వివ‌రాల కోసం కింది లింక్ నొక్కండి.
https://www.facebook.com/1516765641907894/photos/a.1516771355240656.1073741827.1516765641907894/1682350012016122/?type=3&theater